ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎపి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

 ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎపి హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై సోమవారం విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం ఎన్నికలను నిర్వహించొద్దంటూ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేస్తూ.. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం వెల్లడించొద్దని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 23కి హైకోర్టు వాయిదా వేసింది.