ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే

ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం చేపట్టిన మరో భూసేరణ వ్యవహారంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల పంపిణీతో పాటు మరికొన్ని చోట్ల వివాదాస్పద భూములు సేకరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే క్రమంలో రాజమండ్రి వైశ్యసదన్ ఆధ్వర్యంలోని భూములను ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. తమ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించడంపై వైశ్యసదన్ హైకోర్టును ఆశ్రయించింది. 32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.