చదువులో బీహార్ కన్నా వెనుకబడిన ఏపీ: జనసేన

*సిబిఐ దత్తపుత్రుడు ఏ వన్ జగన్ అయితే, రాష్ట్రంలో వైసిపి బ్రోకర్గా సజ్జల..

*కనీసం పదో తరగతి పరీక్షలు కూడా పెట్టడం చేతకాని ఈ రాష్ట్ర ప్రభుత్వం..

*జనసేన పార్టీ ప్రతి విమర్శనాస్త్రాలు..

*మా పవన్ కు విద్యార్థి అభిమానులు ఉన్నారు.. కానీ మీ జగన్ కు దొంగలు, గుండాలు, రౌడీలే ఫ్యాన్స్..

తిరుపతి: వైసిపి మూడేళ్ల పాలనలో చదువు సంక నాకి పోయిందని దేశంలోనే తక్కువ విద్య శాతం ఉన్న బీహార్ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ లో దిగజారి పోయిందని.. దీనికి కారణం పాలక ప్రభుత్వం అని మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు.

స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం జనసేన నేతలు పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, బాబు సింగేరి, మునస్వామి, కృష్ణ, మనోజ్ కుమార్, జీవన్ రాయల్ లతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి ఏ వన్ అయితే స్టేట్లో బోకర్ పనులు చేస్తూ.. సజ్జల బ్రోకర్ పేరును సార్థకం చేశారని విమర్శించారు. సజ్జల రాత్రి డీల్ చేస్తారని.. డే లో సీఎం సిగ్నేచర్ తో కోట్ల వ్యాపారంతో మోసం చేస్తూ.. బాధితుల ఉసురు పోసుకుంటున్నారని.. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లలో పదవులకు, ఉద్యోగాలు కొనసాగింపు లాంటి డీల్స్ తాను తెలంగాణ, ఏపీ ల హైవే రహదారిలో చేయలేదని సజ్జల కాణిపాక వినాయకుని సన్నిధిలో ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు.

ప్రమాణం చేస్తే బాధితులు రోడ్డుపైకి వస్తారని.. లేనిపక్షంలో బాధితులు ఇచ్చిన కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. బిజెపి జాతీయ నేత నడ్డా వైసీపీని భారీగా విమర్శిస్తే నోరుమెదపని ఫ్యాన్ పార్టీ నేతలు.. జనసేన, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఎందుకు ఫైర్ అవుతారని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయమా లేక ప్రతిపక్షాల అంటే చులకనా అంటూ చురకలు వేశారు.