గురజాలలో జనసేన ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు

గురజాల, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం సత్యనారాయణ ఐనాక్స్ థియేటర్ వద్ద షేక్ అజీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిం.ది ముందుగా అజీస్ మాట్లాడుతూ మా మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటకం అంకారావు కేక్ కట్ చేసి మా లిటిల్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ దేవుడు చరణ్ బాబు కి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మణి, చందు, ప్రసాద్ బాబు, తేజ మరియు జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.