ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. పోస్టర్ వైరల్!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన మేటైన నటనతో తెలుగు రాష్ట్రాలలో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. అయితే తన తాత నందమూరి తారక రామారావు గారి నటన వలే  జూనియర్ ఎన్టీఆర్ నటన ఉంటుందని తమ అభిమానులు తెలిపారు. అంతేకాకుండా తన తాతగారి రాజకీయ పాలన వలే తను కూడా అదే విధంగా పాలిస్తాడనే ఆలోచనతో ఓ ఫ్లెక్సీలో నెక్స్ట్ సీఎం గా ప్రకటించారు.  ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాబోయే నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి ఎన్టీఆర్ ఫోటో తో ఓ ఫ్లెక్సీ ను సిద్ధం చేశారు. అందులో నందమూరి తారక రామారావు అనే పేరు రాసి. దాని కింద నెక్స్ట్ సీఎం అని ఫ్లెక్సీలో వేశారు. అంతేకాకుండా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉండగా. ఆ ఫ్లెక్సీను ఎవరు ఏర్పాటు చేశారని చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల పై ఎటువంటి ఆసక్తి చూపకపోగా పలుమార్లు తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఇంతకుముందు పాల్గొన్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ ను పట్టుకుని దిగిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తాడనే ఆలోచనలు ఇంతవరకు ఎటువంటి వార్తలు రాకపోగా. ప్రస్తుతం ఈ విషయం పై తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మరో హీరో రామ్ చరణ్ కాంబినేషన్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 2019లో మొదలుపెట్టిన ఈ సినిమా కొన్ని వాయిదాలతో ప్రస్తుతం 80 శాతం పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమరం భీమ్ పాత్రలో నటించంగా… వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు.