వైసీపీ నాయకులపై తక్షణమే ఏపి పోలీసులు చర్యలు తీసుకోవాలి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులపై తక్షణమే ఏపి పోలీసులు చర్యలు తీసుకోవాలని అమలాపురం పార్లమెంటరీ జనసేన నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ ఆదేశాల మేరకు అమలాపురం, రాజోలు, పి.గన్నవరం జనసేన వీర మహిళలు కలిసి జిల్లా అడిషనల్ ఎస్పీకి అమలాపురం రూరల్ సిఐకి, రూరల్ ఎస్సైకి, టౌన్ సిఐకి మండల పోలీస్ స్టేషన్ లో శనివారం కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.