బొర్రా ఆధ్వర్యంలో దూళిపాళ్ళలో సంక్రాంతి సంబరాలు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి మండలం, ధూళిపాల్ల గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసి ఆశీస్సులు అందజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. చిన్నారులపై రేగి పండ్లు ఎందుకు పోస్తారు అంటే రేగు పండ్లనే భోగి పళ్లు అని అంటారు. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నర దిష్టి, గ్రహ పీడ నివారణ కలుగుతుందని నమ్ముతారని, తలపై భాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారని, అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారన్నారు అనంతరం చిన్నారులతో బొర్రా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర రావు, గ్రామ అధ్యక్షులు కామినేని నరసయ్య, అద్దేపల్లి రామారావు,జవాది శీను, లింగిశెట్టి వీరాంజనేయులు, లింగిశెట్టి శేషాద్రి, చిలకా పూర్ణ, షేక్ ఖాసిం తదితర జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.