లడాఖ్ చైనాలో ఉన్నట్టు చూపినందుకు క్షమాపణలు: ట్విటర్

లడాఖ్ ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్టు చూపినందుకు క్షమాపణలు చెబుతున్నామంటూ పార్లమెంటరీ కమిటీకి ట్విటర్ లిఖిత పూర్వక లేఖ పంపింది. పొరబాట్లను ఈ నెల 30 కల్లా సరిచేస్తామని కూడా తెలిపిందని ఎంపీ మీనాక్షి లేఖి వెల్లడించారు. ఇండియా మ్యాప్ ను తప్పుడుగా జియో ట్యాగింగ్ లో చూపామని వాంగ్మూలం ఇచ్చిందని కూడా ఆమె చెప్పారు. పైగా భారతీయుల సెంటిమెంట్లను గాయపరిచినందుకు కూడా సారీ చెప్పారని ఆమె పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ను సోషలిస్టు రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చూపి కూడా ట్విటర్ చెయ్యరాని తప్పు చేసిందని మీనాక్షి చెప్పారు. ఈ లేఖను పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకుందన్నారు.