రేణిగుంట మండల మరియు పట్టణ కమిటీల నియామకం

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండల అధ్యక్షులుగా తిమ్మారెడ్డి ముని కుమార్ రెడ్డి మరియు రేణిగుంట పట్టణ అధ్యక్షులు గా పి. విజయానందరావు లను ఇదివరకే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించడం విదితమే. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్ సూచనల మేరకు రేణిగుంట మండల & పట్టణ కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. రేణిగుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల మరియు పట్టణ కమిటీ సభ్యులకు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నియమక పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు తిమ్మా రెడ్డి మునికుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పి. విజయానందరావు, నియోజకవర్గ కార్యదర్శులు మునికుమార్, మనోజ్ ఘని, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.