బందరు మండలంలో గ్రామ కమిటీల నియామకం

మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ బందరు మండలంలో పోతిరెడ్డి పాలెం, మేకవానిపాలెం, బుర్రపోతుపాలెం, బుద్దాలపాలెం పంచాయతీ కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చౌదరి, సర్పంచ్ గళ్లతిమోతి, నరేష్ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సమీర్, జిల్లా నాయకులు, జన్ను నాగరాజు, జి భవాని, జిల్లా పట్టణ స్థాయిలో ఉన్న నాయకులు, డివిజన్ ఇంచార్జిలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.