అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అరకు జనసేన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు వర్కింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మణ్ రావు రామదాసు.

అరకు నియోజకవర్గం డుంబ్రిగుడా మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడా మండలాధ్యక్షుడు రాజు, రామకృష్ణ, చినబాబు అద్వర్యంలో సోమవారం భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను, స్మరించుకొంటు వారి విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆయన ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడనీ, ఆయన “భారతరత్న” భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.! అని గుర్తు చేశారు.! ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు వేలి మండల నాయకులు రామకృష్ణ డుంబ్రిగుడా మండల నాయకులు రామదాసు, ఆశోక్, చినబాబు జనసేన పార్టీ యువకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొనడం జరిగింది.