అంబేద్కర్ కు నివాళులర్పించిన ​బాడీశ మురళీకృష్ణ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులర్పించిన జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడీశ మురళీకృష్ణ

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 65 వవర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో సత్రం సెంటర్ నందుగల అంబేద్కర్ చిత్ర పటానికి జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ మరియు తునికిపాటి శివ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ తునికిపాటి శివ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన మహామేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలందించారని రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమని రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని ఆ దిశగా జనసేన పార్టీ ముందడుగు వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరించడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపి చారి, లింగరాజు, బత్తుల గోపయ్య, గోపీచంద్, వినయ్, పవన్, నవీన్, వినయ్, సతీష్, తేజ తదితరులు పాల్గొన్నారు.