ఇకపై రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ అమలు

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పటి వరకూరాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఈ పధకం అమలవుతున్న సంగతి తెలిసిందే.. ఇకపై రాష్ట్రమంతా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మిగిలిన ఆరు జిల్లాల్లోనూ ఈ పధకం అమలు కానుంది. ఈ రోజు  ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శ్రీ మిగిలిన 6 జిల్లాల శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పధకాన్ని వర్తింపు అమలును సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.  సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు ఇవాళ కోవిడ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు.  కాగా, ఇప్పటికే 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పధకంలో అదనంగా 234 వ్యాధులను చేర్చారు. దీనితో మొత్తం 2,434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులు రూ. 1000 దాటితే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.