నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం: రాటాల రామయ్య

రాజంపేట, జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం ప్రజాస్వామికమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. సోమవారం సిద్దవటం మండల పరిధిలోని ఉప్పరపల్లిలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలోని టైకూన్ జంక్షన్ వద్ద పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డును తెరవాలని నిరసన కార్యక్రమం చేపడుతుంటే జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి ప్రతిపక్షాల పట్ల వివరిస్తున్న తీరు చాలా అమానుషమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం నేడు సొంత నాయకులు జేబులు నింపుకునే దానికి రియాల్టర్లుగా మారి రాష్ట్ర సంపాదన దోచుకున్న పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిరసనల ద్వారా ప్రతిపక్షాలు తెలియజేసే కార్యక్రమం తలపెడితే పోలీస్ వ్యవస్థ ద్వారా గొంతునొక్కే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందన్నారు.నాదెండ్లతో పాటు అరెస్టు చేసిన పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.