వైసీపీ గుండాలను అరెస్ట్ చేయండి: చీపురుపల్లి జనసేన

చీపురుపల్లి నియోజకవర్గం జనసేన కార్యాలయంలో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ చీపురుపల్లి మండలం, బేవారపేట గ్రామంలొ ఇటీవల జరిగిన సంఘటనలో వైసీపీ గుండాలు జనసేన కార్యకర్తలు12 మందిని అతి గోరంగా కొట్టటం జరిగింది. ఘటన జరిగి ఇప్పటికే మూడు రోజులు అవుతుంది. అయినప్పటికీ చీపురుపల్లి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా వైసీపీ గుండాలను అరెస్ట్ చేయండి జనసేన కార్యకర్తలకు న్యాయం చేయండి. లేనిపక్షంలో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతాం అని తెలియజేసారు.