మహిళా రైతుకు అండగా నిలిచిన మాడుగుల జనసేన

మాడుగులలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకి మాడుగుల అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న యాల్లా కొండమ్మ అనే మహిళా రైతుకు సంబంధించిన సూడి గేదె పిడుగుపాటు వలన చనిపోవడం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న మాడుగుల జనసేన పార్టీ జనసేన నాయకులు రొబ్బా మహేష్ సొంత నిధులు 10వేలు రూపాయిలు వేమన గోవిందు చేతుల మీదగా బాధితురాలికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసైనికులు ఇల్లపు రమేష్, గళ్ళ గణేష్, అప్పి, నూకరాజు, వేపాడ నాగు, సంతో నూకరాజు, నాయుడు, ఊడి పండుతో పాటు కొలనికి చెందిన పలువురు యువకులు పాల్గొనడం జరిగింది.