గాన గంధర్వుడు కోలుకోవాలని కోరుకొoటున్న అశ్వినీదత్ మరియు ఇళయరాజా

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ‘‘బాలు, 40 ఏళ్ళ మన స్నేహ బంధం ఇంకా ఇలాగే 60 ఏళ్ళు సాగాలి నువ్వు తొందరగా లేచి రావాలి.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్’’ అని ట్వీట్ చేశారు.

గానగంధర్వుని ఆనారోగ్య స్థితిపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా స్పందింస్తూ…బాలు త్వరగా లేచి రా..నీ కోసం మేం అంతా ఎదురుచూస్తున్నాం..

మన స్నేహం కేవలం సినిమాల వరకు పరిమితంకాదు.. మనం గొడవపడ్డ సందర్భాల్లో కూడ ఇద్దరిమధ్య స్నేహం కొనసాగింది. మనిద్దరి మధ్య మాటలు లేని సమయంలో కూడ మన స్నేహం చెక్కు చెదరలేదు.. ఎల్లపుడు మనం స్నేహితులుగానే ఉన్నo. నువ్వు బాగుంటావని నీ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుందని నీవు త్వరలోనే నన్ను కలుస్తావని నా అంతరంగం చెబుతోంది.. అంటూ ఇళయరాజా ఎమోషనల్‌ అయ్యారు.