దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి: రెడ్డి అప్పల నాయుడు

  • ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ రోజున జరిగిన పరస్పర దాడుల మీద స్పందించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరులో సార్వత్రిక ఎన్నికలు జరిగీ రెండు రోజులు పూర్తయిన కూడా ఇంకా ఏలూరు నియోజకవర్గంలో పరస్పర దాడులు ఆగకపోవడంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని రెడ్డి అప్పల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా పరస్పర దాడులతో పెట్రేగిపోయారని 13వ తేదీ ఎన్నికల రోజునే పోణంగిలో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అన్నారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి కూడా కోడి కత్తులతో, సీసా పెంకులతో దాడులు చేయడం, కార్యకర్తల్ని గాయపరచుకోవడం చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, బాధ్యులపై తగు చర్యలను తీసుకోవాలని సూచించారు.‌ ఎంతో ప్రశాంతంగా ఉండే ఏలూరు నియోజకవర్గంలో ఈ విధమైన పరిణామాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. మరో 20 రోజుల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత గెలిచిన శాసనసభ్యులు ఇటువంటి సంఘటనలు అరికట్టే విధంగా, ప్రజలకు రక్షణ కల్పించాలని నాయకులను రెడ్డి అప్పలనాయుడు కోరారు.