బానిస బతుకులు మానుకోండి

  • జగన్ రెడ్డి వేసే బిస్కెట్లు కోసం ఆశపడితే రానున్న రోజుల్లో చరిత్ర హీనులవుతారు
  • కాపు జాతి అంటేనే పౌరుషం, అలాంటి జాతిలో పుట్టి ఊడిగం చేయటం ఇప్పటికైనా మానుకోండి
  • జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ధ్వజం

వైస్సార్సీపీ కాపు నాయకులు జగన్ పాదయాత్ర సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవాలని జనసేన జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాపు జాతి అభివృద్ధి మరచి జగన్ వద్ద బానిసలుగా మారి జనసెన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయటమే లక్ష్యంగా పనిచేయటం వైసీపీ కాపు నేతలు సిగ్గు పడాల్సిన విషయమని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కాపులకు నాయ్యం చేస్తానని చెప్పి దగా చేసింది వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. దేశంలో ఆర్ధికంగా వెనుబడిన అగ్రకులాలకు కేంద్ర ఇచ్చిన 10శాతం రిజర్వేషన్ లో ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వంలో శాసనసభలో తీర్మానం చేస్తే ఆవిషయాన్ని తుంగలో తొక్కింది మీ నాయకుడే కదా అన్నారు అలానే మీ నాయకుడు అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి రూ.2వేల కోట్లు ఇస్తాను అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడి 3ఏళ్ళు గడుస్తుంది మీరు కాపు కార్పొరేషన్ కి ఎంత విడుదల చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ చేర్చే ప్రయత్నం చేస్తా అన్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలిపి మీ నాయకుడిని అడిగి కాపులకు న్యాయం చేయవలసినదిగా కోరుకుంటున్నామన్నారు.ఆలానే విదేశీ విద్యాదీవెన రాక ఎంత మంది కాపు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో వైసీపీ కాపు నాయకులకు తెలుసా అని ప్రశ్నించారు. ముందు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మీ నాయకుడికి చెప్పండి, అంతే కానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని వాగుతూ ఉంటే రానున్న రోజుల్లో కాపులు అందరూ కలిసి మీకు రాజకీయ చరమ గీతం పాడుతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే బానిసత్వం వదిలి కాపుల అభివృద్ధికి పాటుపడండి అని అన్నారు. ఇప్పటికైనా మీ నాయకుడి మీద ఒత్తిడి తెచ్చి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అలా కాకుండా కాపు జాతికి అన్యాయం చేస్తే, రానున్న రోజుల్లో ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదురుకోవాలిసి వస్తుంది హెచ్చరించారు.