గృహ సముదాయాన్ని పరిశీలించిన నెల్లిమర్ల జనసేన

నెల్లిమర్ల, 2014లో ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హూద్ హుద్ తుఫాను భాదితులకు గత ప్రభుత్వం 2019 లో కొవ్వాడ సమీపంలో గృహ నిర్మాణం చేపట్టింది. ఈ గృహ సముదాయాన్ని నెల్లిమర్ల జనసేన నాయకులు మంగళవారం పరిశీలించారు. సుమారు 2.5 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ నేటికీ పూర్తి చేయలేదని మరియు ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు అందించవలసినదిగా జనసేన పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల ఇంచార్జి బూర్లె విజయశంకర్, జలపారి శివ, మాదేటి ఈశ్వర్రావు(బుజ్జి), జానకీరామ్, పిన్నింటి అప్పలనాయుడు, పిన్నింటి సురేష్ కుమార్, దుక్క అప్పలరాజు, లెంక సురేష్, వసాది రమణ, డూండురామ్, వికాస్, బాలు, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.