క్రిస్మస్ వేడుకల్లో బి.సావరం వైస్ ప్రెసిడెంట్ రావూరి నాగబాబు

రాజోలు నియోజక వర్గంలో బి.సావరం గ్రామలో శోభన హైస్కూల్ నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి పెట్టింది పేరు మన భారతదేశం అని అన్నారు, కులాలకు మతాలకు అతీతంగా కలిసి మెలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మంచి శుభపరిణామం అని ప్రజలకు క్రిస్మస్ శుభకాంక్షలు తెలియ చేశారు. వేడుకల్లో భాగంగా నృత్య ప్రదర్శనలను చేసిన విద్యార్దిని విద్యార్దులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.సావరం గ్రామ పంచాయతీ ప్రసిడెంట్, సొంపల్లి ఎంపీటీసీ, స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు హాజరు అయ్యారు.