బాబు జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన శెట్టిబత్తుల

అమలాపురం, దీన జనోద్దారకుడు పూజ్యశ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకుని స్థానిక బుద్ధ విహార్ ఎదుట మరియు నడిపూడిలో గల డా౹.బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు గల జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు జనసేన పార్టీ నాయకులు పూలమాలంకరణ చేసి ఘన నివాళి అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సుధా చిన్నా, మోకా బాలయోగి, ముత్తాబత్తుల శ్రీను, పోణకల ప్రకాష్, అరళ్ళపల్లి దుర్గ, గోర్తి పవన్ తదితరులు పాల్గొన్నారు.