ఆర్డీవోని సమాచారం కోరిన బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఆర్డీవోని సమాచార హక్కు చట్టం ద్వారా జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు బిజెపి నాయకులు రఘు కలిసి సమాచారం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, పల్లెం రాజా, చీమల సతీష్, రమేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. సమాచార చట్టం ద్వారా ఈ క్రింది అంశాలను కోరడం జరిగింది. 1). బొబ్బిలి రెవిన్యూ డివిజన్ లోని అన్నిమండల లోని రెవెన్యూ గ్రామాల వారీగా దేవాదాయ శాఖ భూములు, మిగులు భూములు (సీలింగ్ ల్యాండ్) దేవాదాయ శాఖ భూములు వివరాలు. 2). బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో ఇప్పటివరకు జరిగిన బంజరు మరియు మిగులు భూముల అన్సైన్ కమిటీ చేసిన వివరములు. 3).ఎల్ సీ సీ ల్యాండ్ పంపి చేసిన వివరాలు, బదలాయింపు జరిగితే వాటిపై భూ బదలాయింపు నిషేధచట్టం(పి ఓ ట్) ప్రకారం చర్యలు చేపట్టిన భూముల వివరాలు కావలెను. 4). ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ, తప్పుడు అమ్మకాలు అమ్మిన వారిపై చట్టపరంగా మీరు తీసుకున్న చర్యలు వివరాలు. 5). ప్రభుత్వం ఇల్లు స్థలం పంపిణీ కోసం భూసేకరణ చేసిన తర్వాత రైతులకు చెల్లించిన నగదు వివరములు భూ సేకరణ చేసిన భూములు వివరములు తెలియజేయమని కోరడం జరిగింది.