ప్రజాగళం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బడేటి రాధాకృష్ణయ్య, రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం, 16వ డివిజన్ కొబ్బరి తోట లోని రామాలయం రోడ్డులో జరిగిన ప్రజాగళం ఆత్మీయ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అబద్ధాలను అతి సునాయాసంగా పదేపదే చెబుతూ అందుకు తగ్గట్టుగా నటిస్తూ, ఇతరులను నమ్మించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిది అందెవేసిన చెయ్యి అని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని అన్ని సర్వేలు తేటతెల్లం చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో సైకో సీఎం జగన్‌ అబద్ధాలు వల్లిస్తూ ప్రజలను నమ్మించే స్థాయికి దిగజారిపోయారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు 16వ డివిజన్‌ కొబ్బరితోట రామాలయం వీధి వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఊడచైర్మన్ దంపతులు మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ వాలంటీర్లపై జగన్‌ కపట ప్రేమ చూపుతూ వారిని సైడ్‌ దారి పట్టించడం చూసి టిడిపి అధినేత చంద్రబాబు వారిలో మనోస్థైర్యాన్ని నింపేందుకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాన్ని 10వేల రూపాయలకు పెంచుతానని భరోసా ఇచ్చారన్నారు. దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేసి తన స్వలాభానికి వాడుకోవాలని జగన్‌ ప్రయత్నించడం ఆయన నీచ మనస్థత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం జగన్‌కు ప్రతి ఎన్నికల్లో శవాలతో రాజకీయం చేయడం అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్యను ఉపయోగించుకుని అధికారం చేజిక్కించుకున్న జగన్‌ ఇప్పుడు తాను నమ్మిన దేవుడి స్క్రిప్ట్‌ ప్రకారం ఆ హత్య ఉదంతం నుంచి బయటపడలేక ఓటమి బాట పట్టనున్నారని ఆయన పేర్కొన్నారు. రోజురోజుకు సీఎం జగన్‌ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఆయన మాటల్లోనే తేటతెల్లమవుతోందన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల నుంచి వంద రూపాయలు లాగేసుకుంటూ సంక్షేమం పేరుతో వారికి 10 రూపాయలు తిరిగి ఇస్తున్నారని బడేటి చంటి ఆరోపించారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని కోరుతున్న జగన్‌ వారికి చేసిన మంచేంటో చెప్పగలరా అంటూ ఆయన నిలదీశారు. వైసిపి నీచ రాజకీయాలు తట్టుకోలేకే వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని వైసిపి నాయకులు గ్రహించాలన్నారు. మద్యపాన నిషేదం అమలు చేస్తేనే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్‌ ఇప్పడు ఏ ముఖంతో ప్రజలను ఓటు అడుగుతారో చెప్పాలన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రజల ముందుకు వెళ్ళిన జగన్‌ రాష్ట్రంలోని సహజ వనరులపై కన్నేసి గత ఐదేళ్ళుగా వాటిని దోచుకుతిన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మేము సిద్దం పేరుతో బస్సులో తిరుగుతూ ప్రజల ఆస్తులపై కన్నేసి రానున్న రోజుల్లో వారికి తెలియకుండా వాటిని కూడా తాకట్టు పెట్టేసి రుణాలు తీసుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి విలువలు లేని రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధి, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టిడిపి, జనసేన, బీజేపి కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తనకు ఒక అవకాశం ఇస్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇంచార్జ్ శ్రీకాకుళం రమేష్, తలపంటి రాంబాబు, దివాకర్, రాఘవ, కాటూరి శ్రీను, బాబ్జి, ఆలూరిరవి, జనసేన క్లస్టర్ ఇంచార్జ్ వీరంకి పండు, డివిజన్ ఇంచార్జ్ ఆకుల రాజేష్, జనసేన నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జీ జనసేన రవి, జనసేన నాయకులు బోండా రాము నాయుడు, నూకల సాయి ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, బుధ్ధా నాగేశ్వరరావు, గొడవర్తి నవీన్, కోలా శివ, అరవింద్, మేకా సాయి, వీరమహిళలు కొసనం ప్రమీల, గాయత్రి, పావని మరియు భారీ సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.