ఎంపీపీ బషీర్ చర్యలపై బగ్గుమన్న జన శ్రేణులు

కంచికచర్ల: ఎంపీపీ మలక్ బషీర్ ఆధ్వర్యంలో మండలంలోని పెండ్యాల గ్రామంలో ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ దగ్ధం చేస్తున్న వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డౌన్ డౌన్ ఎంపీపీ, వెంటనే పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పూజారి రాజేష్ మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఒక వార్డు మెంబర్ తో కలిసి విచక్షణను మరిచి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిస్తూ దగ్ధం చేయించిన మలక్ బషీర్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై కల్పించుకొని బషీర్ చర్యలను సమర్థించకుండా క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో అతనిని వార్డు మెంబర్ ను వారి పదవుల నుండి భర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి గురించి మహిళల అదృశ్యం గురించి ప్రశ్నిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ఆయన అన్నారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నమ్మితే జగన్మోహన్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పాలి కానీ అటువంటిది రాష్ట్రంలో జరగడంలేదని అన్నారు. మహిళలు అదృశమయ్యారని పవన్ కళ్యాణ్ గొంతు ఎత్తితే అందుకు రాష్ట్ర హోమ్ మినిస్టర్ జవాబు చెప్పాల్సింది పోయి మహిళా కమిషన్ చైర్పర్సన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాలుగేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే మంత్రి రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుందని విమర్శించారు. వాలంటీర్లు నింపే దరఖాస్తు ఫారంలో ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల గురించి వివరాలను సైతం తెలియజేయాలని కోరినట్లు ఉందని ఇటువంటి సమాచారం ఎవరికైనా ఎలా ఇస్తామని ఆయన అన్నారు. ఒక వ్యక్తి పథకానికి అర్హుడా అనర్హుడా నిర్ణయించే అధికారం రెవిన్యూ శాఖలోని ముఖ్య అధికారికి మాత్రమే ఉంటుందని అటువంటి అధికారాన్ని ఎటువంటి అర్హత లేని ఒక వాలంటీర్ కి అప్పజెప్పడం ద్వారా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్వవస్థలో అనేక లోపాలున్నాయని చెప్పారు. వారు సేకరించే డేటాను హైదరాబాద్ లోని ఒక కంపెనీకి ఇస్తున్నారని, అందులోని 700 మందికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని ఆ పార్టీ మంత్రులే చెప్పారు. ప్రజలందరూ వాలంటీర్లకు వారి సమాచారం ఇచ్చే ముందు ఆలోచించాలని కోరారు. వాలంటీర్లు సేకరించిన డేటా పోలీసుల భద్రతలో ఉంచాలని పవన్ కోరితే ఆయన చిత్రపటం పట్ల స్థానిక ఎంపీపీ ప్రవర్తించిన తీరు హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఏదో వ్యాఖ్యలు చేశారని, మరేదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అధికారం నేతలు వాలంటీర్లు రెచ్చ కొట్టి మరి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తగలబెట్టించడం దారుణమని, 24 గంటల్లో ఎంపీపీ మలక్ బషీర్ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని అలా లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే అతనిని పదవి నుంచి చేయాలని లేదంటే నియోజకవర్గం నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలలో చైతన్య వస్తుందని, ఎవరు తమకు మేలు చేస్తారనే విషయాన్ని గ్రహిస్తున్నారని అన్నారు. ప్రజలలో మార్పు వస్తే అది అధికార మార్పునకు శ్రీకారం చుడుతుందని చెప్పారు. ఆపార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ మాట్లాడుతూ 5000 జీతంతో యువత లోని ప్రతిభను వారిలోని శక్తిని ఐదు వేలకే అలా కట్టిపడేస్తుందని ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలని చెప్పేసి వాలంటరీలే కోరుకుంటున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. కానీ వారిలో ఉన్న కొంతమంది చెడ్డవాళ్ళను మాత్రమే పవన్ కళ్యాణ్ విమర్శించారని చెప్పి ఈ వైసిపి నాయకులు కొంతమంది వాలంటీర్లు గుంపులో చేరిపోయి నిరసన కార్యక్రమాలు చేపట్టారు అని అన్నారు. అసలు చెప్పాలంటే వాలంటీర్లను పవన్ కళ్యాణ్ ఏమని విమర్శించారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని మండల ఎంపీపీ హోదాలో ఉన్న మలక్ బషీర్ మండలంలోని అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరించడం పక్కన పెట్టి, తాను ఒక ప్రజా ప్రతినిధిని అనే విషయాన్ని మరిచి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దగ్ధం చేయించడం చెప్పులతో కొట్టించడం తమను తీవ్రంగా కలిసి వేసిందని అన్నారు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు యొక్క చిత్రపటాలు పట్ల ఈ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు చెయ్యలేదని ఇటువంటి చర్యలు కేవలం వైసీపీ నాయకులకే చెల్లాయని ఆయన అన్నారు. 30 ఏళ్ల పైబడిన మంచినీటి పైప్లైన్ తో పట్టణంలో మంచినీటి సరఫరా అద్వాన స్థితిలో ఉన్న విషయం ఈ ఎంపీపీ కనిపించడం లేదని, పలు కాలనీలలో వర్షాకాలం డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్య చేరి ప్రజల పడుతున్న అవస్థలు కనిపించవా, గ్రామాలలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పట్టించుకోరని, చివరికి తన సొంత గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయించలేని అసమర్ధ ఎంపీపీగా తనను తాను నిందించుకుంటున్న ఇటువంటి వ్యక్తి ఈ మండలానికి ఎంపీపీగా ఉండటం మండల ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు. మలక్ బషీర్ తన చర్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళా విభాగం అధ్యక్షురాలు మేకపోతుల శ్రీ లక్ష్మి యాదవ్, వీరులపాడు మండల అధ్యక్షుడు బేతంపూడి జయరాజు, చందర్లపాడు మండల అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్, అనాసాగరం కౌన్సిలర్ తాటి శివ కృష్ణ, నందిగామ మండల పట్టణ అధ్యక్షులు తాటి శివకృష్ణ, రామారావు, పెద్దినేటి హరిబాబు, కొఠారు దేవేంద్ర, కుసునూరు నరసింహారావు, పెరుమాళ్ళ సురేష్, జర్రిపోతుల చంటిబాబు, వనపర్తి పద్మారావు, పుప్పాల వేణుగోపాల్, కుర్రా నాని, పద్మావతి, సూరా సత్యనారాయణ, నాగలక్ష్మి, సౌందర్య, ఆదిలక్ష్మి, పార్వతి, కంభంపాటి రమాదేవి, తాటి విజయ, దేవిరెడ్డి అజయ్ బాబు, ఖాసీం, ఆకుల వెంకట్, సింగం శెట్టి శ్రీనివాస్, ఉప్పల సతీష్, మాడుగుల ప్రవీణ్, నగిరికంటి ప్రభాకర్, చావుల బాలు, గోపి, శ్రీనాధ్, వెంకట స్వామి, వంశి, సూర్య, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.