జనసైనికుడికి అండగా పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న మట్టాడిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు మడికి శ్రీనివాసరావుని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని పితాని హామీ ఇచ్చారు. వీరితోపాటు జక్కం శెట్టి బాలకృష్ణ (పండు), గొలకోటి వెంకటేశ్వరరావు, పితాని రాజు, పెన్నాడ శివ, వంగా విజయ సీతారాం, బొక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.