బల్లిపర్రు గ్రామ సచివాలయమా? వైసీపీ కార్యాలయమా?

పెడన నియోజకవర్గం: గ్రామపంచాయతీ కార్యాలయాలను సచివాలయాలుగా మార్చడం ద్వారా బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థకు తూట్లు పొడిచిన వైసిపి ప్రభుత్వం, గ్రామ సచివాలయాలను తమ సొంత పార్టీ కార్యాలయాలుగా మార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని
పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు మండిపడ్డారు. ఆదివారం ఎస్ వి బాబు మీడియా ముఖంగా మాట్లాడుతూ బల్లిపర్రు గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన వైసిపి పార్టీ సమావేశాన్ని బల్లిపర్రు గ్రామ ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే కాకముందే ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ఉప్పల రాము పెడన ప్రజలకు ఎలాంటి సంకేతకాలిస్తున్నారొ ఒకసారి అర్థం చేసుకోవాలి.
గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతగా సర్వనాశనం చేసిందో మనందరం చూసాం. మరో మారు మరింత నాశనం చేయడానికి జగన్ రెడ్డి సిద్ధం కావచ్చు. దానికి వైసిపి కార్యకర్తలు సంసిద్ధం కావచ్చు కానీ దుర్మార్గమైన వైసిపి పాలనను అంతమొందించడానికి ప్రజలు ఎప్పుడో సంసిద్ధం అయ్యారన్న విషయాన్ని వైసిపి నాయకులు గుర్తించాలి. పంచాయతీ అధికారుల వ్యవహార శైలి మార్చుకోవాలి. మనం ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవకులం, అధికార పార్టీ నాయకులకు బానిసలం కాదని గుర్తించాలి.