నవంబరు 31 వరకూ నిషేధం!

ఢిల్లీ లో వాయు కాలుష్యం పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం  విధించిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఢిల్లీ ఎన్సీఆర్‌లో ఈరోజు రాత్రి మొదలుకొని నవంబరు 31 వరకూ అన్నిరకాల బాణసంచా విక్రయాలను, కాల్చడాన్ని నిషేధించింది. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం వాయు కాలుష్యం ఉన్న పట్టణాల్లో, నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వెలిగించాలని కోరింది. అయితే దీపావళి, ఛఠ్, నూతన సంవత్సరం, క్రిస్మస్ తదితర వేడుకల సమయంలో కేవలం రెండు గంటపాటు మాత్రమే పొగలేని టపాసులు వెలిగించుకోవాలని ఆదేశించింది.