ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 79.88 కోట్ల మందికి ఉచిత రేషన్

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం, నగదు బదిలీ లబ్ధిదారులకు మే, జూన్ నెలల్లో రూ. 25,332.93 కోట్ల విలువైన ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా 79.88 కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందనున్నాయి. పీజీఎంకేఏవై కింద ఈ నెల 1 నుంచే ఆహార శాఖ దీనిని అమలు చేస్తోంది. వచ్చే నెలలోనూ ఉచిత ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేయనుంది.