మన్యం వీరుడు అల్లూరికి ఘనమైన నివాళులు అర్పించిన బండారు శ్రీనివాస్

*125వ జయంతి సందర్భంగా అల్లూరికి ఘనమైన నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్

*125 వ జయంతి సందర్భంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఇవే మా ఘనమైన నివాళులు: జనసేన కుటుంబం

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆత్రేయపురం మండలంలోని, ఆత్రేయపురం గ్రామం నందు సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకమైన, ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తెలియజేశారు. స్వాతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎంతో మరువలేనిదిని, బ్రిటిష్ వారి దుర్మార్గాలను ఎదిరించిన, నిలబడిన గొప్ప పోరాటయోధుడని, మన్యం ప్రజల గుండెల్లో ఒక దేవుడుగా ఎప్పుడు కొలువై ఉన్నాడని, అదేవిధంగా దేశ ప్రజలందరికీ ఒక అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తుడు చేసిన ప్రాణత్యాగం ఎప్పటికీ దేశము మరువదని, బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంనకు అధ్యక్షునిగా ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు నాయకత్వంలో పలువురు గ్రామ నాయకులు, మండల, నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా పాల్గొని, అల్లూరి సీతారామరాజు విగ్రహమునకు జోహార్లు అర్పించారు.