పొడగట్లపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన బండారు శ్రీనివాస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, రావులపాలెం మండలం, పొడగట్లపల్లి గ్రామంలో ఇటీవల కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన సుమారు 8 మంది కుటుంబాలను కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పరామర్శించి, పలువురు కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా కలిసిన వారి కుటుంబం శనగపూడి గిరీష్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. రెండవదిగా చిలకమర్తి రామ్మూర్తి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. మూడవదిగా గండి సత్యవతి వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. నాలుగవదిగా మారే సత్తయ్య వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. ఐదవదిగా హనుమంతు సోమయ్య వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. ఆరవదిగా పులగం శ్రీను వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. ఏడోదిగా మామిడిపల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. ఎనిమిదవదిగా కుండేపర్తి నాగరత్నం కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. ఈ 8 కుటుంబాల వారి కష్టసుఖాలను ఎంతో ఆత్మీయతతో వింటూ, కుటుంబ పెద్దలు లేని లోటు చాలా బాధాకరమని వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల ప్రముఖ నాయకులు నంబు రవికుమార్, వీటి రాజు, పులగం ప్రసన్నకుమార్, జనిపి రెడ్డి సూరిబాబు, చిలకమర్తి శివ, కొండేపర్తి శ్రీను, చొక్కా రాజేష్, యర్రంశెట్టి బాబి, సుంకర రాజేష్, కనాసి గణేష్, గండి శ్రీను, దాసిరెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆలమూరు మండల సీనియర్ నాయకులు మూలస్థానం గ్రామస్తులు సలాది జయప్రకాష్ నారాయణ (జెపి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.