15, 16తేదీల్లో బ్యాంకుల సమ్మె పోస్టర్‌ ఆవిష్కరణ

అమరావతి: ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ 15, 16 తేదీల్లో జరిగే దేశ్యాప్త సమ్మెను జయప్రదంచేయాలని బ్యాంక్‌ యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బ్యాంక్‌ సమ్మె పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రజా వ్యతిరేకవిధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకులను ప్రయివేటీకరించొద్దని డిమాండ్‌ చేశారు.