జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ను ఆవిష్కరించిన బండ్రెడ్డి రామ్ మరియు బండి రామకృష్ణ

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

కృష్ణా జిల్లా, మచిలీపట్టణం, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల ఇంచార్జుల చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా మచిలీపట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ మరియు మచిలీపట్టణం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్టణం జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.