పలువురిని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

  • కంచుమర్తి కృష్ణయ్యకు రుపాయలు 10,000 ఆర్ధికసాయం

రాజానగరం, రాజనగరం మండలం, పరిజల్లిపేట గ్రామానికి చెందిన కంచుమర్తి కృష్ణయ్య అనారోగ్య సమస్యతో రాజమండ్రి హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకుని జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, కంచుమర్తి కృష్ణయ్యని పలకరించి, జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం, తోకాడ గ్రామానికి చెందిన జనసేన యువ నాయకులు ఉద్దండ్రాపు బాబి ప్లేట్లెట్స్ సమస్యతో రాజమండ్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి శివరాం, నాతిపాం దొరబాబు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, చిట్టిప్రోలు సత్తిబాబు, అరిగెల రామకృష్ణ, ఈవూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.