పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లలో బత్తుల

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన విజయవంతం చేయాలని పిలుపు
  • 200 కార్లతో భారీ కాన్వాయ్ తో వెళ్లి అఖండ స్వాగతం * రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, ఈ నెల 15 వ తేదీన ఉత్తరాంధ్ర మూడు రోజుల పర్యటనకు విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు రాజానగరం నియోజవర్గం నుండి 200 కార్లతో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో అందరూ జనసేన టీ షర్ట్ లతో జనసేన కార్ స్టిక్కర్లతో అత్యంత భారీ కాన్వాయ్ గా వెళ్లి అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భోజనం వసతితో పాటు దారిపొడవునా హోర్డింగ్ లతో, ఫ్లెక్సీలతో, జనసేన జెండాలతో, విశాఖపట్నం మొత్తం జనసేన మయం అయ్యేలా జనసేన సత్తా రాష్ట్రానికి తెలిసేలా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. కార్ల కాన్వాయ్ శనివారం ఉదయం ఏడు గంటలకు, కోరుకొండ గ్రామం నుండి కాన్వాయిగా బయలుదేరి వెళ్ళనుంది. అక్కడే టీషర్ట్లు, కార్ స్టిక్కర్లు, జనసేన జెండాలు, ఉదయం అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ వద్ద 200 ప్లకార్డులతో అధినేతకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ భారీ కాన్వాయ్ ని అందరూ విజయవంతం చేయాలని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పిలుపునివ్వడం జరిగింది.