జనసేన నాయకులను ఆహ్వానించిన బత్తుల

  • మహా రక్తదాన శిబిరానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులకు ఆహ్వానం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈనెల 29న రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామంలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే “మహా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు గంటా స్వరూప దేవి, ప్రియా సౌజన్య, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్, లింగోలు పండు, యాళ్ళ నాగ సతీష్, పోలిశెట్టి నాగ మానస ఇతర ముఖ్య నాయకుల్ని కలిసి ఆహ్వానించడం జరిగింది. నాయకులందరు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మట్ట వెంకటేశ్, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల శ్రీను, అరిగెల రామకృష్ణ, ఇవూరి శ్రీనివాస్, చిట్టిప్రోలు సత్తిబాబు, బోయిడి వెంకటేష్, కర్రి దొరబాబు, మన్యం శ్రీను, కమిడి సత్తిబాబు, డి.ఎం.ఎస్ న్యూస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.