అగ్ని ప్రమాద బాధితునికి మాట ఇచ్చి, నీడ కల్పించిన జనసేన నేతలు

  • ప్రమాదవశాత్తు మా ఇల్లు కాలిపోయి పసి పిల్లలతో చలికాలం పరదాలతో జీవిస్తుంటే జనసేన నాయకులు మాకు మాట ఇచ్చి, నీడ కల్పించారు, జనసేన పార్టీకి ఋణ పడి ఉంటాం – బాధిత కుటుంబం

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన అబ్బదాసరి కిరణ్ ఇల్లు ప్రమాదవశాత్తూ కాలి కుటుంబం మొత్తం సర్వస్వం కోల్పోవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే జనసేన నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా ఆర్థికసాయం చేయడం జరిగింది. ఇల్లు పూర్తిగా కాలిపోయి చంటి బిడ్డలతో ఇంటి పక్కన పరదాలు కట్టుకొని ఉన్న ఆ కుటుంబాన్ని మరింత ఆదుకోవాలనే సదుద్దేశంతో వారికి ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన రేకులు మరియు స్తంభాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం కిరణ్ కుటుంబానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, చాట్రాయి మండల కమిటీ నాయకుల సహకారంతో 25 వేల వ్యయంతో అవసరమైన సామాగ్రి 9 స్తంభాలు, 14 రేకులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి పాపారావు, ప్రధాన కార్యదర్శి తగరం సురేష్, కార్యదర్శి మొలుగుమాటి భాస్కరరావు, చీపురుగూడెం గ్రామ జనసేన నాయకులు తుమ్మలపల్లి మోహనరావు, రాజు, పరస గోపాలకృష్ణ, పోతిరెడ్డిపల్లి శివ మరియు జన సైనికులు పాల్గొన్నారు.