రోడ్డెక్కిన బత్తుల జనసేన ప్రచార రథం మహాచండి

🔴 కోరుకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ప్రచారరథానికి ప్రత్యేక పూజలు

🔴 దుష్టత్రయాన్ని శిక్షించి, నమ్మిన వారిని సంరక్షించి, పరమేశ్వరుని అంశయే “మహాచండీ”

🔴 రెండు రోజుల క్రితమే రోడ్డెక్కిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారరథం వారాహి, అదే బాటలో “మహాచండి”

రాజానగరం, కోరుకొండ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మీ దంపతులు అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను, జనసేన పార్టీని ప్రజలకు మరింత చెరువచేయడంలో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లతో చేయించిన జనసేన ప్రచారరథం మహాచండికి గురువారం స్వామివారి సన్నిధిలో “బత్తుల” దంపతులు పురోహితులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీరమహిళల చేతుల మీదుగా జనసేన ప్రచారరథం ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా తయారు చేయించిన డిజైన్ జనసేన శ్రేణులనే కాకుండా, చూపరులను కూడా విశేషంగా ఆకర్షించడం విశేషం. జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.