కాకినాడ సిటి: జనసేనలో చేరికలు

కాకినాడ సిటిలో గురువారం స్దానిక 24వ డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి అజయ్ వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక యువకులు, ఆయన మిత్రబృందం జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారిని కార్యక్రమ ముఖ్య అతిధిగా పాల్గొన్న కాకినాడ సిటి పార్టీ ఇన్ఛార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు, ఆశయాలు, ఆచరణ మార్గం చూపడానికి పార్టీలో కొత్త రక్తం, యువతరం కీలకపాత్ర పోషించనుందని జనసేన పార్టీ పిఎసి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ గతంలో ఆనాడు ఉన్న తక్కువ నిధులతో అన్నమ్మ ఘాటీ చెరువు చుట్టూ ఆక్రమణలు నిరోధించడానికి గోడ కట్టించడం జరిగింది. తరువాత దాన్ని పట్టించుకోని ప్రభుత్వం ధొరణివల్ల ఆ గోడ కూలినపుడు ఒక అభం శుభం తెలియని పిల్లవాడు చనిపోవడం మీకు గుర్తుచేస్తున్నా. ఆవేళ వేసిన పునాదులు ఈరొజుకీ తదుపరి అభివృద్ధి జరగకుండా అలానే పడి వున్నాయి. దీనికి కారణం కేవలం రాజకీయ నాయకులు మిమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా చుడటమే అని భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో సర్వరాయ టెక్స్టైల్స్ లో ఉపాధి పొందిన చాలామందికి మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఒక ఎస్.సి కాలనీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసి అన్ని కులాలని ఇక్కడ చేర్చడం జరిగింది. ఈ ప్రాంతంలో గత పది ఏండ్లలో ఎంతమంది రెల్లి కులస్తులకి పట్టాలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను. పదవులిచ్చాం, కార్పోరేటర్ సీట్లు ఇస్తాం అని మభ్యపెట్టడం తప్ప మీలో ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారని నేను అడుగుతున్నాను. మీకు రాజకీయ పార్టీలు పదవులిచ్చినప్పుడు అభినందిస్తున్నాను, మీకు ఆ పదవులు ఇప్పించినందుకు మీ నాయకులని అభినందిస్తున్నాను అలాగే ఇక్కడౌన్న ప్రజలకి న్యాయం చేయాలిసిన బాధ్యత కూడా ఉందని మీ నాయకులకి గుర్తుచేస్తున్నాను. నేడు కాకినాడలో 16000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెపుతున్న వై.సి.పి ప్రభుత్వం ఈ 24వ వార్డులో ఎంతమందికి మంజూరు చేసిందని ప్రశిస్తున్నాను. మొన్న వాకబు చేస్తే ఈ ప్రాంతంలోని వారికి చొల్లంగిలో ఇచ్చామని చెపుతున్న ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని స్థలాలు చూపెట్టారా అని ప్రశిస్తున్నాను. దామాషా ప్రకారం ఎస్.ఎస్టి సబ్-ప్లాన్ ప్రకారం స్మార్ట్ సిటి నిధులలో ఎంత మీ అభివృద్ధికి ఈ వై.సి.పి ప్రభుత్వం ఖర్చు చేసిందని ప్రశ్నిస్తున్నా. మీనాయకులు కూడా వారిలొ భాగస్వామి మరి ఎందుకు సాధించలేకపొయారని అడుగుతున్నా. చొల్లంగిలో ఇచ్చామంటున్న ఇళ్ళని ఈ సంవత్సరంలో పూర్తిచేసి మిమ్మల్ని గ్రుహప్రవేశం చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామన్న వాగ్దానం సంగతి ఏంటి అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతానికి రెండు వీధుల అవతల ఒక పేద మహిళ ఎలాంటి పించనులు పొందని ఒకావిడ డ్వాక్రా సంఘంలో యాభైవేల రుణం తీరకుండా చనిపోతే ఆవిడ కూతురు రుణం తీర్చవలసిందే అని అధికారులు తేల్చి చెప్పడం ఎంత బాధాకరమో కాదా కేవలం డ్వాక్రా అధికారులు నిర్లక్ష్యంతో పదిరూపాయల ఇన్సూరెన్స్ కట్టించకపోడంతొ ఇలాంటి పరిస్థితి ఏర్పడటం తీవ్ర విచారాన్ని కలగచేసిందన్నారు. దీనికి ఈ వై.సి.పి ప్రభుత్వం బాధ్యత వహించి రుణాన్ని రద్దు చేయించాలని హెచ్చరించారు. అలాకాని పక్షంలో జనసేన తరపున ఆ మ్రుతురాలి కూతురు తరపున మేము పొరాడతామని, తామే నెల నెలా ఇన్స్టాల్మెంట్ కట్టేలా చూస్తామని తెలియచేసారు. అలాగే తమ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల ఇన్శూరెన్స్ మొత్తం ప్రభుత్వం చెల్లించే బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా జనరల్ సెక్రటరీ తలాటం సత్య, జిల్లా జాయింట్ సెక్రటరీ బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడ్బల సత్యనారాయణ ఓలేటి రాము, వార్డ్ అదక్ష్యులు శ్రీమాన్ నారాయణ, దుర్గాప్రసాద్, ఆకుల శ్రీనివాస్, బట్టు లీల, మేరీ, జాక్ జనసైనికులు పాల్గొన్నారు.