పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బత్తుల మహాయాగం

రాజానగరం, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు నిర్వహిస్తున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల మహాయాగంలో భాగంగా సోమవారం యాగశాలలో 360 మంది ఋత్వికులచే 109 కుండాలలో రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించడం జరిగింది. 109 యజ్ఞ కుండాలలో ఏకకాలంలో 360 మంది ఋత్వికులు మంత్రోశ్చరణల మధ్య క్రతు నిర్వహణ నభూతో నభవిష్యత్ అనే విధంగా జరుగింది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి విఘ్నాలు లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజ్యాధికారం సిద్ధించాలని నిర్వహిస్తున్న యజ్ఞం ఎంతో శక్తివంతమైనది మరియు ప్రాధాన్యత గలదని తెలిపారు.

యజ్ఞాలక్షణం:
109 కుండాలు (3 అడుగులు లోతు 1 1/2 అడుగుల వెడల్పుతో నిర్మించిన ప్రతి యజ్ఞకుండం) అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్దలతో నిర్మించి. కృతువుకు కావలసిన విధంగా యజ్ఞ కుండాలను అలంకరించి, సభక్తికంగా 360 మంది వేదపండితుల మంత్రోశ్చరణలతో వేలమంది భక్తులు మనోలగ్నంతో భగభగమని ఎగసిపడుతున్న అగ్ని దేవుని కొలల్లో మహాదేవుని సహిత సుబ్రహ్మణ్యేశ్వరులు మనల్ని దీవిస్తూ అత్యంత ఆనందంలో నర్తిస్తూ శుభమస్తు, అవిఘ్నమస్తు అని దీవిస్తుండగా యజ్ఞం నిరాటంకంగా జరుగుతుంటే భక్తుల కన్నుల పండుగగా యాగం జరుగుతుంది. వేదకాలంలో యజ్ఞం ఒక గంభీరమైన ఆచారంగా పరిగణింపబడేది. అయితే వేద, మధ్యయుగ, ఆధునిక కాలంలో యజ్ఞ నిర్వహణ అత్యంత క్లిష్టంగానూ, హవనం అవి సామాన్యులకు అత్యంత దూరంగానూ మారిపోయింది. కానీ రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ శ్రీ చండీమాత ఉపాసకులు వారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్యి దంపతులు ఇప్పటివరకూ దృఢ సంకల్పంలో ప్రాపంచిక, ఐహిక ఆముష్మిక విషయాలును కాదు ఆధ్యాత్మిక దైవచింతనలో నిరంతరం నిమగ్నమై ఉండే వారు అందులో భాగంగాన ఇప్పటి వరకూ నేటివరకూ వందల హోమాలు నిరంతరం చేయడం దైవ సంకల్పమే గానీ మరి యొక్కటి కాదని తెలిపారు.