హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం మండలం, లాలాచెరువు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిదానంలో ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పాల్గొని, స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్బంగా బత్తుల మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.