దగ్గుపాటి పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల

రాజానగరం: రాజమహేంద్రవరం చెరుకూరి ఫంక్షన్ హల్ నందు రాజమహేంద్రవరం పార్లమెంటరీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.