శాకాంబరీ ఉత్సవాలలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా శాఖంబరి దేవి అమ్మవారిని పలు రకాల కూరగాయలు, పళ్లతో అమ్మవారిని శాఖంబరి అలంకరణతో అలంకరించారు. శాఖంబరి అలంకరణలో ఉన్న అమ్మ వారిని జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దర్శనం చేసుకున్నారు. ముందుగా గ్రామం నుండి రఘుదేవపురం సెంటర్ వరకు బత్తుల వెంకటలక్ష్మితో కలిసి గ్రామ ఆడపడుచులు అందరూ చీర, సారె లతో, పసుపు కుంకుమలతో, పూలు పళ్లతో, అమ్మ వారిని పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలు ఆలయ ధర్మకర్త కాండ్రు నాగేశ్వరావు, మట్ట వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, కరగొట్టి ప్రశాంత్, కవల గంగారావు, దాసరి కోటేశ్వరరావు, వీరమహిళ లక్ష్మి, పూసల బాబు, ప్రగడ శ్రీహరి, బొబ్బిరెడ్డి సూరిబాబు, మామిడాల సుబ్రహ్మణ్యం, చీకట్ల వీర్రాజు, రుద్రం నాగు, తన్నీరు సురేష్, పెంటపాటి శివ, గడ్డం కృష్ణారావు, అడపా లోకేష్, గారపాటి వినయ్, అడ్డగర్ల శ్రీను, హరిదాసు నాని, అడ్డగర్ల మణి, ప్రగడ రాజు, ఉమ్మడిశెట్టి పండు, అడ్డాల అంజి, పోతుల మణికంఠ, అడ్డాల సతీష్, కడియం జాన్, హరిదాసు మోహన్, దాసరి రవి సురేష్, కర్రి మనోహర్, బండ్రేడ్డి దుర్గా ప్రసాద్, మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.