కానవరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కానవరం గ్రామంలో కీ.శే పూడి రాంబాబు ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామం జనసేన పార్టీ నాయకులు రామాశెట్టి సతీష్ గారి నానమ్మ కీ.శే రామశెట్టి లక్ష్మమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కానవరం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.