BCCI సర్వసభ్య సమావేశం..

బిసిసిఐ 89 వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) డిసెంబర్ 24 న అహ్మదాబాద్‌లో జరుగునుంది. ఎజిఎం మోటెరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ సమావేశం జరుగుతుందని బిసిసిఐ కార్యదర్శి జై షా మంగళవారం రాష్ట్ర క్రీడా సంఘాలకు తెలియజేశారు. ఈ మీటింగ్ ముందు డిసెంబర్ 22 న, సభ్యులందరికీ కరోనా సంబంధించిన ఆర్టీ-పిసిఆర్ పరీక్ష ఉంటుందని డిసెంబర్ 23 న ఫలితాలు వెల్లడైన తర్వాత సభ్యులను సమావేశానికి అనుమితిస్తారు.

ఇప్పటికే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసేషన్స్‌కు బీసీసీఐ సమాచారం అందించింది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు, ఐసీసీలో భారత ప్రతినిధుల ఎంపిక చేయడం.. అలాగే ముగ్గురు జాతీయ సెలక్టర్లను ఫైనల్ చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల అనుమతిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఒకవేళ కొత్త జట్లకు అనుమతి లభిస్తే ఐపీఎల్‌లో జట్ల సంఖ్య 10కి చేరుకుంటుంది. ఐపీఎల్ 2021లో ఈ రెండు కొత్త ఆరగ్రేటం చేయనున్నాయి.