మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

ఎమ్మిగనూరు: విప్లవ వీరుడు భగత్ సింగ్ 116వ జయంతి వేడుకల్ని గురువారం మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని ఆయన పోరాట స్పూర్తి ఎంతో మందికి ఆదర్శం అని అన్నారు. మన దేశానికి భగత్ సింగ్ చేసిన త్యాగం వెల కట్టలేదని కనుక ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ గారి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోని ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దత్తు, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.