కింతలవాని పేట గ్రామ ప్రజలతో జనసేన సమావేశం

విజయనగరం జిల్లా, కింతలవాని పేట గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్ట్ అడ్వకేట్ శ్రీమతి పాలవలస యశస్విని మరియు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, కింతలవాని పేట గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశమై వాళ్ల సమస్యలను ఓర్పుగా, సహనంతో విని మీకు అండగా ఉంటామని, మీకు న్యాయం చేసే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. శ్రీమతి యశస్విని మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ మీరు బలంగా నిలబడితే మీ తరపున మేము చాలా బలంగా పోరాడుతాం అని చెప్పారు. బాబు పాలూరు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి కోరుకుంటున్నట్లు ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీని నడిపిస్తూనే, ఫ్యాక్టరీ వల్ల వెలువడుతున్న వ్యర్థ పదార్థాల వలన చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి కాలుష్యం వాటిల్లకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి సూచిస్తామని చెబుతూ, ఫ్యాక్టరీ మరియు ప్రభుత్వ చర్యల వలన తలెత్తిన ప్రతీ సమస్యపై పోరాటానికి మీ వెంట ఉండి మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంచాన గంగాధర్, ఐటి విభాగం గేదెల సతీష్, వీరమహిళలు పైల లక్ష్మి, మణి మరియు పోతల శివశంకర్, గార గౌరిశంకర్, అల్లు రమేష్, సత్య, రమేష్, రమణ పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొనడం జరిగింది.