వైద్యం కోసం భవాని రవికుమార్ ఆర్థికసాయం

పెనుగొండ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవికుమార్ వైద్యం కోసం ఆర్థిక సహాయం అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలోని తోటగిరికి చెందిన జనసైనికుడు శివ భార్య లావణ్య గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తో బాధపడుతుందని పెనుగొండ జనసేన నాయకులు వీర మహిళల ద్వారా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవాని రవికుమార్ కి తెలియజేయడంతో వెంటనే స్పందించి పదివేల(10,000) రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ పట్టణ అధ్యక్షుడు లోకేష్, వీర మహిళలు శ్రీదేవి, భాగ్యలక్ష్మి పెనుగొండ నాయకులు రమేష్, శ్రీనివాస్, ఆకుల రమేష్, శ్రీకాంత్, చిరంజీవి యువత తదితరులు పాల్గొన్నారు.