నాగార్జున కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న ‘బిగ్‌బాస్’

అతి త్వరలో నాల్గవ సీజన్ ప్రారంభం కాబోతుండడంతో  ఈ తీపి కబురుతో షో అభిమానులకు ఉత్సాహం కలిగిస్తుంది.  అయితే ఈ షోకు సంబంధించిన నాల్గవ సీజన్‌ ప్రోమో విడుదలయిన తర్వాత వివిధ స్పందనలు వచ్చాయి. బిగ్‌బాస్ షో కోసం ఎంతమంది ఎదురుచూస్తుoటారో  విమర్శించే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఏది ఏమైనా ‘బిగ్ బాస్’ వస్తున్నాడని ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుండి సందడి వాతావరణం మొదలైంది.

ఇప్పటికే బిగ్‌బాస్ షోలో భాగంగా మూడు సీజన్లు చాలా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ షోలు అన్ని కూడా టీఆర్పీలో ఒకదానికని మించి మరొకటి కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. గత కొన్ని నెలలుగా నాల్గవ సీజన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలనునిజం చేసేలా ‘స్టార్ మా’ బృందం విడుదల చేసినటువంటి ‘బిగ్‌బాస్’ ప్రోమో సెన్సేషన్ సృష్టించింది.

కరోనా కారణంగా పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అందరికీ ముందుగా కోవిడ్ పరీక్షలు చేయడమేకాకుండా అందరినీ కూడా ముందుగానే ఓ పద్నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారని చెప్తున్నారు. అయితే తరువాత మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించి అపుడు నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే షోలోకి తీసుకుంటారట.

నాల్గవ సీజన్‌కు హోస్ట్ గా చేస్తోన్న నాగార్జున కోసం ప్రత్యేకమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారట. ప్రతీ గంటకు సెట్ మొత్తం శానిటైజ్ చేయడమే కాకుండా… నాగార్జున దగ్గరకు యూనిట్ సైతం ఎవ్వరినీ అనుమతిoచరట. 

అయితే ఈ షోలో సామాజిక దూరం పాటించేలా ప్రతి విషయం మైకుల ద్వారానే చెబుతారని, నిత్యం ఓ వైద్యుడు కూడా అందుబాటులో ఉండేలా చూస్తారని అంటున్నారు. నాగార్జున వయసును దృష్టిలో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతోన్నారని వార్తలు వస్తున్నాయి.