మార్కాపురంలో జనసేన నాయకుల జన్మదిన వేడుకలు

మార్కాపురం, జనసేన పార్టీ అధ్యక్షలు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మార్కాపురంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పొదిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పేరూ శ్రీనివాస్, హల్చల్ జహిర్, హఫీజ్, రాకేష్ లు పాల్గొన్నారు. అదే విధంగా పొదిలి మండలంలోని మాదిరెడ్డి పాలెం గ్రామంలోని జనసేన పార్టీ కార్యకర్త అంజి ఏర్పాటు చేసినవంటి కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి.